epaper
Sunday, March 1, 2026
epaper

వివాహ ముహూర్తాలపై వేణుస్వామి సంచలన వీడియో

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu Swamy)  నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు సంబంధించి ఆయన పోస్ట్ చేసే వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియో సంచలనంగా మారింది. పెళ్లి ముహూర్తాలకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. ముహూర్తాలు చూసుకుని వివాహం చేసుకున్నప్పటికీ ఎందుకు అనేక జంటలు విడాకుల దిశగా వెళ్తున్నాయన్న అంశంపై ఆయన జ్యోతిష్య శాస్త్రం అనుగుణంగా విశ్లేషించారు.

కేవలం ముహూర్తం చూసుకోవడం మాత్రమే సరిపోదని.. జాతకాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది పెళ్లి సమయంలో శుభముహూర్తానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, కానీ దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహస్థితులను పట్టించుకోవడం లేదన్నారు.

జాతక విశ్లేషణ ఎలా చేయాలన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. ఆన్‌లైన్‌లో ఎవరైనా  తమ జాతక చక్రాన్ని పరిశీలించవచ్చని, మేషం నుంచి ప్రారంభమయ్యే లగ్నాలలో వ్యక్తికి సంబంధించిన లగ్నాన్ని మొదటి స్థానంగా (1వ భావంగా) గుర్తించాలని తెలిపారు. ఆ తర్వాత ఏడో స్థానాన్ని ‘కళత్ర స్థానం’గా పరిగణించాలన్నారు.

దాంపత్య జీవితంపై ప్రభావం చూపేది ముఖ్యంగా ఈ ఏడో స్థానమేనన్నారు. ఈ స్థానంలో కేతువు, శని వంటి గ్రహాలు ఉంటే వివాహ జీవితంలో విభేదాలు, దూరం లేదా ఆలస్యంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అలాగే ఏడో స్థానంలో ఉన్న గ్రహస్థితి, దృష్టులు, యోగాలను సమగ్రంగా పరిశీలించకుండా కేవలం ముహూర్తం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ లో ముహూర్తాలు చూసుకొని జ్యోతిష్య

వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జ్యోతిష్యంపై విశ్వాసం ఉన్నవారిలో విస్తృత చర్చకు దారితీశాయి. అయితే జ్యోతిష్య విశ్లేషణ వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడుతుందని, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!