epaper
Monday, March 2, 2026
epaper

ప్రేమ వివాహం.. యువకుడిపై అమ్మాయి బంధువుల దాడి

కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగాలపల్లి గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం (Inter Caste Love Marriage) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో ఒక యువకుడిపై అమ్మాయి తరఫు బంధువులు అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రామలింగాలపల్లికి చెందిన అజయ్ అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఇష్టం లేని అమ్మాయి తరఫు బంధువులు అజయ్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం అజయ్ ఒంటరిగా ఉన్న సమయంలో మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు.

మొదట అజయ్ కళ్లలో కారం కొట్టి, అతను ప్రతిఘటించకుండా చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తులతో అజయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగులు అజయ్ శరీరంలో సుమారు 14 చోట్ల కత్తితో పొడిచినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావమై అజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతను చనిపోయాడని భావించిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అజయ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రామలింగాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!