epaper
Sunday, March 1, 2026
epaper

ట్రబుల్స్ లో ‘బిగ్‌బాస్‌’లు…

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పాలనలో ‘ఎగ్జిక్యూటివ్ పవర్స్’తో బాస్‌లుగా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు (IAS IPS Officers) కొందరు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతున్నందునో, సొంత ప్రయోజనాలు ఆశించి ఫైళ్లు క్లియర్ చేస్తున్నందునో వారికి అవినీతి మచ్చ అంటుతున్నది. పాలకుల ఒత్తిళ్లకు లొంగుతున్నారా? నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? వారు చేసే తప్పులకు వంత పాడుతున్నారా? సరిచేయాల్సిన బాధ్యతను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారా? కారణాలేవైనా కొందరు సివిల్ సర్వెంట్లు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో శ్రీలక్ష్మి జైలుకెళ్లారు. బీపీ ఆచార్య విచారణను ఎదుర్కొన్నారు. తెలంగాణలో సోమేశ్ కుమార్, రజత్ కుమార్, ప్రభాకర్ రావు, ఏపీలో సంజయ్ వంటి అధికారులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. సీబీఐ, ఈడీ, ఏసీబీ కేసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్. కొందరు అధికారులు సర్వీస్ తొలినాళ్లలో మంచి పేరు తెచ్చుకున్నా.. తర్వాత కాలంలో అవినీతి మరకలు అంటించుకుని వార్తల్లో నిలిచిన కథనాలు వింటూనే ఉన్నాం. ఉభయ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కుంభకోణం కేసుల్లో కొందరు అధికారులు అభియోగాలు మోస్తున్నారు, విచారణలు ఎదుర్కొంటున్నారు, జైలుకి వెళ్ళొచ్చినవారూ ఉన్నారు.

అలా వివాదాల్లో చిక్కుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల (IAS IPS Officers) వ్యవహార శైలిపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also : సోషల్ మీడియా బ్యాన్: పిల్లల ఫ్యూచర్ పై ఇండియా అడుగులు ఎటు?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!