epaper
Sunday, March 1, 2026
epaper

99 రోజుల యాక్షన్ ప్లాన్.. తెలంగాణ సర్కార్ కీలక జీవో

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ డిపార్టుమెంటుల్లో పనులను వేగవంతం చేసే 99 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ జీవో ఆర్టీ నంబర్ 293 ను జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా ఏర్పాటైన ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉండనున్నారు.

రాష్ట్రంలోని వివిధ డిపార్టుమెంట్లలో కీలకమైన ప్రాజెక్టులు, పాలసీల అమలును వేగవంతం చేసేందుకే సర్కార్ ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫైనాన్స్, ఎనర్జీ, ఐటీ, రెవెన్యూ వంటి కీలక రంగాలపై దృష్టి సారించినట్లు సమాచారం. యాక్షన్ ప్లాన్ ని త్వరలో ఫైనలైజ్ చేసి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read Also : భర్త సీఎం.. భార్య ఎమ్మెల్యే.. అసెంబ్లీలో ప్రశ్నలు..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!