కలం, జనగామ : జనగామ జిల్లా (Jangaon) స్టేషన్ ఘనపూర్ మండలంలోని రిజర్వాయర్లోకి గురువారం ఓ షిఫ్ట్ కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిల్పూరు మండలం దేశాయి తండా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి రిజర్వాయర్లో పడిపోయింది. కారులో అద్దాలు పగలడంతో ధరావత్ చరణ్ అనే యువకుడు గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే కారు నడుపుతున్న భూక్య పవన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
Follow Us On: Youtube

