epaper
Sunday, March 1, 2026
epaper

ఏపీలోని ప్రతి ప్రాజెక్టు టీడీపీ కట్టిందే : చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్​ : అసెంబ్లీలో (Assembly) రాయలసీమ ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం నదుల అనుసంధానం ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గంగా (Ganga), కావేరి (Kaveri) నదుల అనుసంధానం జరగాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. నదులను అనుసంధానం చేసి తెలుగుతల్లికి జలహారతి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

2014 నుండి 2019 మధ్య కాలంలో సాగునీటి ప్రాజెక్టుల (Irrigation Projects) కోసం దాదాపు 63 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వివరించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, అక్కడి సాగునీటి ప్రాజెక్టులకు సరైన దశ, దిశను చూపించిన గొప్ప నాయకుడు నందమూరి తారకరామారావు అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ కృషితోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. చింతల పూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నల్లమల సాగర్​ వల్ల ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు.

Read Also : ర‌ఘురామ‌ను సీబీఐ అరెస్ట్ చేయాలి: పీవీ సునీల్ కుమార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!