epaper
Sunday, March 1, 2026
epaper

భద్రాద్రి నూతన కలెక్టర్‌గా అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్ (IAS Ankit) నియ‌మితుల‌య్యారు. ఆయ‌న గ‌తంలో నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ 2019లో ఐఏఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ కేడర్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ​ఆయన తన కెరీర్ మొదట్లో నాగర్ కర్నూల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా క్షేత్రస్థాయిలో పాలనపై పట్టు సాధించారు.​నాగర్ కర్నూల్ తర్వాత ఆయన ​ఏటూరునగరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి, ఇక్కడ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, వైద్య సౌకర్యాల మెరుగుదలకు కృషి చేశారు. అనంతరం ​నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలోనే ఆయనకు పరిపాలనాపరంగా మంచి గుర్తింపు లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!