epaper
Sunday, March 1, 2026
epaper

వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక

కలం, సినిమా : టాలీవుడ్ క్యూట్ పెయిర్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుక రాజస్థాన్‌లోని అందాల నగరం ఉదయ్ పూర్‌ (Udaipur) లో వైభవంగా జరిగింది. ఉదయం 10:10 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పవిత్ర ముహూర్తంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి జీవిత భాగస్వామిగా స్వీకరించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు.

సాయంత్రం 4 గంటల తర్వాత కన్నడ సంప్రదాయం కొడువ ఆచారం ప్రకారం మరోసారి  వివాహ వేడుక నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు భిన్న సంస్కృతులను కలిపేలా ఈ పెళ్లి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అభిమానులు కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!