epaper
Monday, March 2, 2026
epaper

కామారెడ్డిలో పదో తరగతి వాల్యూయేషన్ కేంద్రం

కలం, నిజామాబాద్ బ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ ప్రక్రియకు కామారెడ్డి (Kamareddy)  జిల్లా ఎంపికైంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారికి విద్యా శాఖ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. క్యాంప్ ఏర్పాటు చేసే సెంటర్, వాల్యూయేషన్‌కు టీచర్ల సర్దుబాటు, ఇతర వసతులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హైదారాబాద్, వరంగల్ ఆర్‌జేడీలకు కూడా ఈ మేరకు సమాచారం అందించారు. వాల్యూయేషన్ కేంద్రం (Valuation Center) ఏర్పాటుతో తాత్కాలికంగా ఉపాధ్యాయులు, సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, భద్రతా సిబ్బందికి పని దొరుకుతుంది. ఆ ప్రాంతానికి విద్యా పరంగా మంచి గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ స్థాయిలో ప్రాధాన్యం కూడా పెరుగుతుంది.

Read Also:  ఐటీఐలో ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!