epaper
Tuesday, February 24, 2026
epaper

ఆ తేదీలోగా మెట్రో స్వాధీనం : మంత్రి పొంగులేటి

కలం, డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘సిటీ మెట్రో రైలు ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలో నడిచిందని.. ఫేజ్-1 గిట్టుబాటు కాని కారణంగా ఫేజ్ 2, 3 చేపట్టలేమని ఆ కంపెనీ చెప్పింది. ఫేజ్2, 3ను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఫేజ్-1 ను మార్చి 31లోగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో మెట్రో ప్రాజెక్టుపై చర్చిస్తాం. ప్రతిపక్షాల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: రేపు లొంగిపోనున్న మావోయిస్టు అగ్ర నేతలు.. తెలంగాణలో ముగిసిన శకం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>