కలం, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్న డేవిడ్ మిల్లర్, కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు చేసి భారత్‌కు సవాల్ విసిరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మిల్లర్ తనదైన శైలిలో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన కేవలం 26 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించారు. అయితే, 16వ ఓవర్‌లో బంతిని అందుకున్న వరుణ్ చక్రవర్తి భారత్‌కు అత్యంత కీలకమైన బ్రేక్ ఇచ్చారు. వరుణ్ వేసిన లెగ్‌బ్రేక్ బంతిని మిల్లర్ ఇన్‌సైడ్ అవుట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించారు.
కానీ, బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోవడంతో అది నేరుగా లాంగ్-ఆఫ్‌లో ఉన్న తిలక్ వర్మ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ప్రమాదకరమైన మిల్లర్ ఇన్నింగ్స్ ముగిసింది. మిల్లర్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించాలనే ఆశలకు బ్రేక్ పడింది. అంతకుముందు శివమ్ దూబే కూడా డెవాల్డ్ బ్రెవిస్ (45) వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బతీశారు. ప్రస్తుతం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని నియంత్రిస్తున్నారు.


