epaper
Sunday, February 22, 2026
epaper

ఆస్తి వివాదం.. మిత్రుడిని కత్తితో పొడిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లా పరిధిలోని కాకతీయ వర్సిటీ సమీపంలో దారుణ ఘటన జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అతడి స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని 4వ డివిజన్ కార్పొరేటర్ అశోక్, కృష్ణ కాలనీకి చెందిన లక్ష్మణ్ మిత్రులు. భూమి విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అశోక్, లక్ష్మణ్‌తో మరోసారి గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి అశోక్ తన వద్ద ఉన్న కత్తితో లక్ష్మణ్‌పై దాడిచేసి గాయపరిచాడు. సమాచారమందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>