కలం, డెస్క్ : ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం చాలా బడ్జెట్ తో కూడిన పని. ఇల్లు మీద లోన్ (Home Loan) పెడితే దాని పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి నెలా ఈఎంఐ కట్టలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సంపాదించే డబ్బులో ఇంటి అవసరాలకే ఒక్కోసారి అయిపోతే.. ఈఎంఐ లేట్ కావచ్చు. అప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఇలా ఈఎంఐ మిస్ అయితే ఏం జరుగుతుందో కూడా తెలియక ఇబ్బంది పడుతుంటారు.
ఈఎంఐ మిస్ అయితే జరిగేది ఇదే..
మీరు హోం లోన్ (Home Loan) ఈఎంఐ కరెక్ట్ తేదీకి కట్టలేకపోతే.. అప్పుడు లోన్ అకౌంట్ లో తేదీ ముగిసింది అని చూపిస్తుంది. అప్పుడు బ్యాంకులు మీ పరిస్థితిని తెలుసుకోడానికి ట్రై చేస్తాయి. బ్యాంకు నుంచి మీకు ఫోన్ చేసి ఎందుకు కట్టలేదు, ఎప్పుడు కడుతారు అని తెలుసుకుంటారు. మీరు పలానా తేదీన కడుతాను అంటే బ్యాంకులు ఏమీ అనవు, కాకపోతే కొంచెం ఫైన్ పడుతుంది. ఈఎంఐతో దాన్ని కలిపి కట్టేయాలి.
క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా..?
మీరు ఈఎంఐ మిస్ అయిన వెంటనే క్రెడిట్ స్కోర్ తగ్గదు. ఎందుకంటే బ్యాంకులు ఈఎంఐ మిస్ అయిన వెంటనే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్టు చేయవు. మీ పరిస్థితిని తెలుసుకుంటాయి. ఈఎంఐ డేట్ నుంచి నెల రోజుల దాకా మీరు కట్టకపోతేనే అప్పుడు క్రెడిట్ బ్యూరోలకు రిపోర్టు చేస్తాయి. మీరు ఈఎంఐ మిస్ అవడం కంటే.. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, సరైన సమాధానం ఇవ్వకపోతేనే బ్యాంకులు సీరియస్ గా తీసుకుని క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తాయి. కాబట్టి బ్యాంకుల నుంచి వచ్చే ఫోన్లకు సరైన సమాధానం ఇవ్వండి.
ఈ పని చేయండి..
మీరు ఏదైనా ఆర్థిక పరిస్థితుల వల్ల హోం లోన్ ఈఎంఐ కట్టలేకపోతే మీరే బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పండి. పలానా తేదీన కడుతాను అని వివరించండి. అప్పుడు బ్యాంకులు మీ మీద నమ్మకంతో ఎలాంటి యాక్షన్ తీసుకోవు. గడువు తేదీ నుంచి నెల రోజుల్లోపు ఫైన్ తో సహా కచ్చితంగా కట్టండి. లేదంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. నెల రోజుల తర్వాత మీకు లీగల్ నోటీసులు కూడా వస్తాయి. కంటిన్యూగా మూడు సార్లు ఈఎంఐ మిస్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీరు ఈఎంఐ మూడు నెలలుగా కట్టకపోతే మీ ఆస్తిని వేలం వేసే అధికారం బ్యాంకుకు ఉంటుంది. ఈఎంఐ మిస్ కావడం చిన్న సమస్యే అయినా.. దాన్ని పెద్దది కాకుండా చూసుకోండి.
Read Also: యాదాద్రి దర్శనం చాలా కాస్ట్‌లీ గురూ.. ప్యాకేజ్‌ని బట్టి వరాలు
Follow Us On: Instagram


