epaper
Sunday, February 22, 2026
epaper

ట్రంప్ టారిఫ్‌ల రద్దుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

కలం, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై వేస్తున్న టారిఫ్ లను (Trump Tariffs) అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుపై తొలిసారి భారత్ స్పందించింది. కేంద్ర వాణిజ్యశాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును, ఆ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడిన విషయాలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ‘అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్ లను రద్దు చేసిన విధానాన్ని, ఆ తర్వాత ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను విశ్లేషిస్తున్నాం. ట్రంప్ తీసుకునే నిర్ణయాల ఎఫెక్ట్ ఇండియాపై ఏ మేరకు ఉండొచ్చనే దానిపై పరిశీలిస్తున్నాం’ అంటూ తెలిపింది కేంద్ర వాణిజ్యశాఖ.

అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్ లను కొట్టేయడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల తీరును తప్పుబట్టారు. ఇప్పటి వరకు టారిఫ్ లు రద్దు అయిన దేశాలపై 10 శాతం వేస్తున్నట్టు ప్రకటించారు. 150 రోజుల దాకా ఈ టారిఫ్ లు (Trump Tariffs) అమల్లో ఉంటాయని ట్రంప్ తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మళ్లీ రచ్చ మొదలైంది.

Read Also: ఫోన్‌పేలో కొత్త ఏఐ ఫీచర్.. ఇక వాయిస్‌తోనే చెల్లింపులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>