epaper
Sunday, February 22, 2026
epaper

పాఠకులకు గుడ్ న్యూస్.. భద్రాద్రి కొత్తగూడెం మారుమూల గ్రామాల్లో లైబ్రరీలు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గ్రంథాలయాలు నిర్మిస్తామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. శుక్రవారం ఆయన కొత్తగూడెం పట్టణంలోని గ్రంథాలయాన్ని పరిశీలించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ వీర బాబు మారుమూల ప్రాంతాల్లో గ్రంథాలయాలు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయడంతో పీవో ప్రతిపాదనలు చేయాలని సూచించారు.

చంద్రుగొండ, దమ్మపేట, టేకులపల్లి మండలాల్లో నూతన గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా ఐటీడీఏ (ITDA)  తరపున అందిస్తామని తెలిపారు. యువత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఐటీడీఏ పీవో సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>