epaper
Sunday, February 22, 2026
epaper

ఎన్‌ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడిగా వినోద్ జాఖర్

కలం, వెబ్​ డెస్క్​ : భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) బాధ్యతల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐ నూతన జాతీయ అధ్యక్షుడిగా వినోద్ జాఖర్‌ (Vinod Jakhar)ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న వరుణ్ చౌదరి స్థానంలో వినోద్ జాఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్ఎస్‌యూఐ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ రాజస్థాన్ విద్యార్థి జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు. రాజస్థాన్ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా గెలిచిన వినోద్ జాఖర్​ (Vinod Jakhar)..  2024లో ఆయన రాజస్థాన్ NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

విద్యార్థి సమస్యలపై నిరంతర పోరాటాలు చేయడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు దేశవ్యాప్తంగా 15 మంది విద్యార్థి నేతలను రాహుల్‌గాంధీ స్వయంగా ఇంటర్‌వ్యూ చేశారు. చివరకు వినోద్‌కు ఆ అవకాశం లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>