epaper
Sunday, February 22, 2026
epaper

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో అనూహ్య ఘటన.. యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Summit )లో యువత అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ భారతదేశానికి నష్టమని నినాదాలు చేశారు. దేశ విదేశీ ప్రతినిధులంతా హాజరై అంతర్జాతీయ సమ్మిట్ అంటూ కీర్తిస్తున్న సమయంలో యువత నినాదాలు సంచలనంగా మారాయి. యూత్ కాంగ్రెస్‌కు చెందిన యూత్ ఒక్కసారిగా భారత్ మండపంలోకి దూసుకొచ్చి చొక్కాలు విప్పి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ ప్రతినిధులు అక్కడ ఉండగానే ఈ నిరసన జరగడంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి యువతను అదుపులోకి తీసుకున్నారు. భారతదేశ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించిన యువతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అదుపులోకి తీసుకున్న యువతను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>