కలం, వెబ్ డెస్క్ : హిందూపురం (Hindupur) ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన సొంత నియోజకవర్గం హిందూపురంలో నేడు (శుక్రవారం) సొంతింటి నిర్మాణానికి సతీసమేతంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ (NTR) వారసుడిగా హిందూపురం (Hindupur) ప్రజలు నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో.. హిందూపురం నియోజకవర్గ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా, ఇక్కడే నా సొంత ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఈరోజు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలిపారు.


