epaper
Sunday, February 22, 2026
epaper

జీవ‌న్ రెడ్డికి అవ‌మానం జ‌ర‌గ‌నివ్వొద్దు: జ‌గ్గారెడ్డి

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌గిత్యాలలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై, స్థానికంగా జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి (Jagga Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డ‌ జీవ‌న్ రెడ్డికి అవ‌మానం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జీవ‌న్ రెడ్డిని ఎంత‌మంది ఎన్ని ప్ర‌లోభాలు పెట్టినా ఏనాడూ పార్టీ మార‌లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌లోనే కొన‌సాగార‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఎంపీగా రెండు సార్లు టికెట్లు ఇచ్చినా స్థానికంగా నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా ఆయ‌న ఓడిపోయార‌ని తెలిపారు. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు, రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు ఈ అంశంపై త‌న అభిప్రాయాలు చెప్తాన‌ని వెల్ల‌డించారు. జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్న సమయంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

జ‌గ్గారెడ్డి ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన నేప‌థ్యంలో ఆయ‌న గురువారం ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు హ‌నుమంత‌రావు, జెట్టి కుమార్‌ల‌కు రాజ్య‌స‌భ స్థానాల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని రాహుల్ గాంధీని కోర‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>