epaper
Sunday, February 22, 2026
epaper

పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: పాకిస్తాన్‌ (Pakistan)లోని క‌రాచీ నగరంలో రంజాన్ మొదటి రోజే విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావ‌డంతో జరిగిన పేలుడులో 16 మంది మృతి చెందగా, అందులో 9 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన పాత సైనిక బజార్ ప్రాంతంలో గురువారం జరిగింది. ఆ సమయానికి రంజాన్ ఉపవాసానికి ముందు తీసుకునే సెహ్రీ కోసం ఓ కుటుంబం మేల్కొని ఉంది. మొదటి అంతస్తులో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ప్రభావంతో భవనం కొంత భాగం కూలిపోయింది. ఈ భవనం ఇప్పటికే పాడైపోయిన స్థితిలో ఉందని అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి. మరణించిన వారిలో రెండేళ్ల నుంచి ప‌దిహేడేళ్లు గల పిల్ల‌లు 9 మంది ఉన్నారు. గాయపడిన వారిలో కూడా ఏడుగురు చిన్న పిల్ల‌లే ఉన్న‌ట్లు తెలిసింది. క్ష‌త‌గాత్రుల‌ను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>