epaper
Sunday, February 22, 2026
epaper

మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా (TSCW) జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) పేరు దాదాపు ఖరారైంది. ఇంతకాలం చైర్‌పర్సన్‌గా ఉన్న నేరెళ్ల శారద పదవీకాలం అయిపోవడంతో కొత్త పాలకవర్గం ఏర్పడాల్సి ఉన్నది. ఈ పోస్టు కోసం పలువురు మహిళా నేతలు పోటీ పడుతున్నప్పటికీ చివరకు గద్వాల విజయలక్ష్మి ఖరారయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన చేయనున్నది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత మొగిలి సునీతారావ్ సైతం ప్రయత్నిస్తున్నారు. ఇక పార్టీకి చెందిన రేగులపాటి రమ్యారావు (కేసీఆర్ బంధువు), స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన సింగారపు ఇందిర, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఇందిరా శోభన్ తదితరులు కూడా ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

కమిషన్ సభ్యుల పేర్లు కూడా త్వరలో ఖరారు :

కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యుల్ని కూడా ప్రభుత్వం నియమించనున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరెళ్ళ శారద 2024 జూలై నెలలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటివరకూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చైర్‌పర్సన్‌గా నియమితులైన సునీతా లక్ష్మారెడ్డి కొనసాగారు. ప్రభుత్వం మారడంతో ఆమె తప్పుకున్నారు. దీంతో నేరెళ్ళ శారద (Nerella Sharada) అపాయింట్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా మహిళా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులంతా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్‌లో చేరిన వెంటనే కే.కేశవరావు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వికి అవకాశం దక్కింది. రాజ్యసభ రేసులో లేనట్లు కేశవరావు స్వయంగా చెప్పడంతో కూతురికి (Gadwal Vijayalakshmi) అవకాశం ఇవ్వాలని పరోక్షంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుతెలిసింది.

Read Also: MPTC ఎన్నికలపై సర్కార్ కీలక డెసిషన్… రెండ్రోజుల్లో ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>