epaper
Monday, February 23, 2026
epaper

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్.. ఇన్ స్టా అకౌంట్ బ్యాన్

కలం, డెస్క్ : యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ కు (Naa Anveshana) బిగ్ షాక్ తగిలింది. 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్ స్టా అకౌంట్ ను ఇన్ స్ట్రాగ్రామ్ కంప్లీట్ గా బ్యాన్ చేసింది. దేశాన్ని దూషించాడంటూ నటి కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్ స్టా గ్రామ్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే అన్వేష్ (Naa Anveshana) అకౌంట్ ను బ్యాన్ చేసింది ఇన్ స్టాగ్రామ్. ఆడవాళ్ల బట్టలపై అన్వేష్ చేసిన కామెంట్లు తీవ్రమైన వివాదానికి దారి తీశాయి.

ఆ సమయంలోనే అతను సీతాదేవి, ద్రౌపదితో పాటు ఇండియా మీద చేసిన కామెంట్లు పెద్ద వివాదం అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అతనిపై కేసులు నమోదయ్యాయి. అన్వేష్ యూట్యూబ్ అకౌంట్ తో పాటు ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్లను బ్యాన్ చేయాలంటూ చాలా మంది సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. లక్షల మంది అన్వేష్ ను అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఏకంగా ఇన్ స్టా అకౌంటే బ్యాన్ అయిపోయింది. ప్రస్తుతం అతనికి యూట్యూబ్, ఫేస్ బుక్ అకౌంట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈ విషయం మీద అతను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>