కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీనితో ప్రశాంత్ వర్మ సినిమాపై ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని .. అందుకే సినిమా రద్దయిందని సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, సలార్ 2, కల్కి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడని.. ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తరువాత వారి కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ సినిమాపై ఫోకస్ పెట్టారు. స్టార్ హీరో రిసబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ నెల 22న హంపీలో జరగనుంది. ఈ సినిమా పూర్తి అయిన తరువాతే ప్రభాస్ సినిమాపై ప్రశాంత్ వర్మ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.


