epaper
Thursday, February 19, 2026
epaper

రాణించిన దూబె, వరుణ్​.. దర్జాగా సూపర్​–8కు భారత్​

కలం, వెబ్​ డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​ 2026 లీగ్​ దశను టీమిండియా విజయంతో ముగించింది(India Beat Netherlands). ఇప్పటికే సూపర్​–8 దశకు చేరుకున్న భారత్​.. బుధవారం నామమాత్రమైన మ్యాచ్​లో నెదర్లాండ్స్​పై గెలుపొందింది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి మొదట బ్యాటింగ్​ చేసిన భారత్ ఆల్​రౌండర్​ శివమ్​ దూబె(66; 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్​లు) మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్​ను 176/7 పరుగులకు పరిమితం చేసి, 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అభిషేక్​ త్రిబుల్​ డక్..

భారత్​ ఇన్నింగ్స్​లో ఆదిలోనే షాక్​ తగిలింది. ఓపెనర్​ అభిషేక్​ శర్మ(0) వరుసగా మూడో మ్యాచ్​లోనూ ఖాతా తెరవకుండానే ఔట్​ అయ్యాడు. ఇన్నింగ్స్​ తొలి ఓవర్లో డకౌట్​గా వెనుదిరిగాడు. అనంతరం కాసేపటికే మరో ఓపెనర్​ ఇషాన్​ కిషన్​(18; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్​) సైతం పెవిలియన్​కు చేరాడు.

ఈ దశలో తిలక్​ వర్మ(31; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్​), కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​(34; 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్​) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ పరుగులు రావడం మందగించింది. అయితే, వీళ్లిద్దరూ ఔటయ్యాక శివమ్​ దూబెకు తోడు హార్థిక్ పాండ్యా(30; 21 బంతుల్లో 3 సిక్స్​లు) ఆఖర్లో బ్యాట్​ ఝలిపించడంతో ప్రత్యర్థికి భారత్ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రింకూ సింగ్​ (6; 3 బంతుల్లో 1 సిక్స్​) నాటౌట్​గా నిలిచాడు. వాన్​బీక్​ 3, ఆర్యన్ దత్​ 2 వికెట్లు తీశారు. కైల్​ క్లెయిన్​కు 1 వికెట్​ దక్కింది.

ఛేదనలో నెదర్లాండ్స్​ పోరాటం ఆకట్టుకుంది. ఆ జట్టు అన్ని ఓవర్లూ ఆడి 176/7 స్కోరు చేసింది (India Beat Netherlands). బాస్​ డి లీడె (33) టాప్​ స్కోరర్​. అతనితోపాటు మరో ఆరుగురు రెండంకెల స్కోరు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్​ చక్రవర్తి 3, శివమ్​ దూబె 2 వికెట్లు తీశారు. బుమ్రా, హార్ధిక్​ చెరో వికెట్​ దక్కించుకున్నారు. ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసిన ​శివమ్​ దూబెకు ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’ దక్కింది.

Read Also: ‘దానం’ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాతే స్పీకర్ డెసిషన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>