epaper
Wednesday, February 18, 2026
epaper

గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి

కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం (Khammam) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఓ యువకుడు ఆకస్మికంగా కుప్పకూలి.. మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కారేపల్లి (Karepalli) మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డుకు చెందిన గణపతి నారాయణ, లక్ష్మీప్రసన్న దంపతుల ఏకైక కుమారుడు సాయిచంద్ర (24) ఈ దుర్ఘటనకు గురయ్యాడు.

బీ ఫార్మసీ పూర్తి చేసిన సాయిచంద్ర హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు మందుల కోసం సమీపంలోని మెడికల్ షాపుకు వెళ్లాడు. అక్కడ మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. ఈ దృశ్యాలు షాప్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. యువకుడు పడిపోవడంతో షాప్ యజమాని వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయిచంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read Also: వనస్థలిపురంలో దారుణం.. కత్తులతో పొడిచి మహిళను చంపిన మాజీ భర్త

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>