కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి (Kamareddy) జిల్లాలో హైవేపై ఓ కారు వేగంగా వచ్చి.. కంటైనర్ ను ఢీకొట్టింది.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కార్ లో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా వెంటనే అంబులెన్స్ లో డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఎగసిపడిన మంటలు చూసి వాహనదారులు పోలీసులకు హైవే అధికారులకు సమాచారం అందించారు. ఘటనలో లారు పూర్తిగా దగ్ధమైంది.
Read Also: ఈ నెల 23న స్టేట్ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Follow Us On: Instagram


