epaper
Wednesday, February 18, 2026
epaper

రాజేశ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం : జాతీయ ఎస్సీ కమిషన్

కలం, నల్లగొండ బ్యూరో : కర్ల రాజేష్ (Karla Rajesh) మృతిపై ఇప్పటివరకు ఛార్జీషీట్ ఎందుకు వేయలేదని జాతీయ ఎస్సీ కమిషన్ (SC Commission) సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పోలీసు లాక్ అప్ డెత్‌కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని కోదాడ పట్టణంలో సోమవారం రామచందర్ రావు పరామర్శించారు. రాజేష్ తల్లి లలితమ్మతో మాట్లాడి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన పెన్షన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, అడిషనల్ డీజీ చౌహన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సమక్షంలో రాజేష్ తల్లి లలితమ్మకు ఆయన అందజేశారు. అనంతరం కోదాడ ఆర్డీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచందర్ రావు మాట్లాడారు. కర్ల రాజేష్ కేసు పత్రికల్లో చూసి జాతీయ ఎస్సీ కమిషన్ సుమోటో కింద కేసు నమోదు చేసిందన్నారు.

కమిషన్ (SC Commission) కేసులో ప్రవేశించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అధికారులు చార్జిషీట్‌కు రెడీ టైమ్ అడిగితే కమిషన్ సీరియస్ అయిందనని రామ చందర్ రావు తెలిపారు. తాము సీరియస్ అయ్యాకే ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో బాధ్యులైన సీఐపై చర్య తీసుకోవడమే కాకుండా ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. పది రోజుల్లో రీపోస్టుమార్టం చేసి నివేదికను అందించాలని ఆదేశించారు. అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోతే సస్పెన్షన్‌తో పాటు 6 నెలలు జైలుశిక్ష కూడా ఉంటుందని రామచందర్ రావు హెచ్చరించారు. రాజేష్ తల్లికి పెన్షన్ మంజూరు చేశామని, మూడు రోజుల్లో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేదా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అడిషనల్ డిజి డిఎస్ చౌహన్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి తదితరులు పాల్గొన్నారు.

Read Also: 5 ఊర్లను తెలంగాణలో కలపాలని చంద్రబాబును అడిగాం : తుమ్మల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>