epaper
Wednesday, February 18, 2026
epaper

బీజేపీ నేత వ్యాఖ్యలపై నటి త్రిష రియాక్షన్​

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు బీజేపీ చీఫ్​ నైనార్​ నాగేంద్రన్​ (Nainar Nagendran) ఇటీవలే నటుడు విజయ్ దళపతి​ (Vijay) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. విజయ్ టీవీకే (తమిళగ వెట్రి కళగం)​ పార్టీ పెట్టిన నేపథ్యంలో ఆయనపై నాగేంద్రన్​ తీవ్ర విమర్శలు చేశారు. విజయ్​ కు రాజకీయ అనుభవం లేదని, ముందు తన ఇంటి నుంచి.. ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. దీనిపై హీరోయిన్​ త్రిష (Actress Trisha) తీవ్రంగా స్పందించారు. సోషల్​ మీడియా వేదికగా తన లాయర్​ ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఒక ఉన్నత రాజకీయ స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదన్నారు.

తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో చేరను అని త్రిష (Actress Trisha) స్పష్టం చేశారు. తన నటన, కళతోనే గుర్తించాలని, వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగకూడదని సూచించారు. మహిళలను అగౌరపరిచే మాటలను ఖండిస్తానని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్ని నటి త్రిష హెచ్చరించారు. మరోవైపు నాగేంద్రన్​ వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయ దుమారం సృష్టించింది. టీవీకే నాయకులు, విజయ్​ ఫ్యాన్స్​ తో పాటు డీఎంకే, కాంగ్రెస్​ నేతలు కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

Read Also: విజయ్, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్ లో ఎక్కడంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>