epaper
Wednesday, February 18, 2026
epaper

ఫిరాయింపులు షురూ..

కలం, మెదక్ బ్యూరో : ఫలితాలు రావ‌డ‌మే అల‌స్యం చైర్మ‌న్ సీటే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. మెదక్ మున్సిపాలిటీ (Medak Municipality) 17వ వార్డులో బీఎస్పీ నుండి కౌన్సిలర్ గా గెలిచిన బుజ‌రంపేట అరుణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సినియార్ నేత మైనంప‌ల్లి హనుమంతరావు, డీసీసీ మెదక్ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. మెద‌క్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం రాలేదు.

మెద‌క్ మున్సిపాలిటీ (Medak Municipality) లో మొత్తం 32 వార్డులు ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ 14, బీఅర్ఎస్ 15, బిజెపీ 2, బీఎస్పీ నుండి ఒకరు విజ‌యం సాధించారు. చైర్మ‌న్ పీఠం దక్కాలంటే 17 మంది కౌన్సిల‌ర్ల మద్దతు కావాల్సి ఉంది. మెద‌క్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మ‌రొవైపు బిజెపీ మ‌ద్ధతు ఇస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అయ్యే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో మెద‌క్ మున్సిపల్ చైర్మ‌న్ ఎన్నిక అస‌క్తిక‌రంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>