epaper
Wednesday, February 18, 2026
epaper

రాజ‌కీయాల్లో తల్లుల ప్రస్తావన ఎందుకు ?

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఇటీవల రాజకీయాల్లో తల్లులను ఎందుకు మిళితం చేస్తున్నారు.. అనే అంశంపై ఆవేశంతో స్పందించారు. ఇలాంటి రాజకీయాలను నేను ఎప్పుడూ చూడలేదు అని ఆయన తెలిపారు. అంబటి రాంబాబు (Ambati Rambabu) తల్లిని తిట్టారు. టీడీపీ వాళ్ళు ప్రేరేపిస్తే.. దానికి ఆయ‌న రియాక్ట్ అయ్యారు. లోకేష్ (Lokesh) తన వాయిస్ పెంచి గట్టిగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. అధికారం చేతుల్లో ఉందని ఇష్టారీతిగా చలాయించ కూడదని బొత్స సత్యనారాయణ  వ్యాఖ్యానించారు.

బొత్స వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత (Anitha) కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు తల్లిని తిట్టినట్టు ఆధారాలు ఉంటే నాకు పంపించండి. వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఒక మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు తన మాటలు, చేష్టలతో సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి గురించి దేవాలయం లాంటి కౌన్సిల్‌లో ఇంత సేపు చర్చ పెట్టడానికి కొంచెమైనా సెన్స్ ఉందా అని అనిత సీరియస్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>