epaper
Wednesday, February 18, 2026
epaper

వడ్డేపల్లి మున్సిపాలిటీ కవిత మద్దతుదారుల కైవసం

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ జాగృతి మద్దతుదారులు విజయం సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ (Waddepally Municipality)లో మద్దతుదారుల గెలుపుతో తెలంగాణ జాగృతి రాజకీయంగా తన బలాన్ని చాటుకుంది. ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేశారు.

మొత్తం 10 వార్డులకు గాను ఏకంగా 8 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీపై పట్టు సాధించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచి తొలి ప్రయత్నంలోనే మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఈ విజయంతో వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>