epaper
Wednesday, February 18, 2026
epaper

అపహరణకు గురైన చిన్నారులను రక్షించిన పోలీస్

కలం, వరంగల్ బ్యూరో : జనవరిలో కాజీపేట పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్నారులను అపహరించి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్, కాజీపేట పోలీసులు(Kazipet Police) అరెస్టు చేసారు. నిందితుల నుండి అపహరణకు గురైన చిన్నారులను రక్షించారు. వీరిలో కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులను గుర్తించి అప్పగించారు. అపరహణకు గురై రక్షించబడిన పై ఫోటోలోని మరో ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో వున్నారు.

నిందితులు ఇచ్చిన సమాచారంతో ఫోటోలోని చిన్నారులలో ఒకరైన 6 సంవత్సరాల బాబు 2023, అక్టోబర్ లో కాజీపేట రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం నుండి నిందితులు అపహరించినట్లుగా వెల్లడించారు. మరో ఏడు మాసాల పాపను 2025, ఆక్టోబర్‌లో మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసరాల నుండి, అలాగే మరో 5మాసాల పాపను నిందితులు రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాల నుండి అపరిహరించినట్లుగా పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ముగ్గురు చిన్నారులను ఎవరైన గుర్తించినట్లయితే కాజీపేట్ పోలీస్ స్టేషన్ (Kazipet Police Station) ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, సెల్ నంబర్ 871268122 సంప్రదించాలి తగిన రుజువులు చూపించిన రక్త సంబంధీకులకు చిన్నారులను అప్పగిస్తామని కాజీపేట ఇన్స్‌స్పెక్టర్ తెలియజేసారు.

 Read Also: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు నిజామాబాద్ క్రీడాకారులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>