కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ పశ్చిమ (Warangal West) నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, ఐదేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) అన్నారు. గురువారం నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 10 ఏళ్లలో నియోజకవర్గానికి రాని నిధులను ప్రభుత్వం నుంచి సాధించామని, ముఖ్యంగా వాటర్ సప్లై మెరుగుపరచడం కోసం రూ. 530 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించామని తెలిపారు. త్వరలోనే పశ్చిమ పరిధిలో నీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆయన (Naini Rajender Reddy) స్పష్టం చేశారు.
Read Also: అపహరణకు గురైన చిన్నారులను రక్షించిన పోలీస్
Follow Us On: Instagram


