కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన హార్వర్డ్ యూనివర్సిటీ కోర్సు ఫీజుకు సంబంధించిన అంశంపై కీలక వివరణ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. ఆ కోర్సు కోసం ఫీజు తన తమ్ముడు ఇచ్చాడని వెల్లడించారు. గతంలో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ క్లాసులకు హాజరైన సమయంలో, ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజల సొమ్మును వృథా చేస్తూ విదేశాల్లో కోర్సులు చేస్తున్నారని ఆరోపించాయి. ఈ విమర్శలన్నింటినీ ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ఆ కోర్సు ఫీజు పూర్తిగా వ్యక్తిగతమని, ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేయలేదని ఆయన తెలిపారు.
Read Also: బాబోయ్.. భయపెట్టిన భారీ సింక్ హోల్!
Follow Us On: Instagram


