epaper
Wednesday, February 18, 2026
epaper

చిన్న జీయర్ స్వామిపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: ఆదిశంకరాచార్యులపై చిన్న జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిన్న జీయర్ స్వామి కామెంట్స్‌పై రాష్ట్రీయ వానరసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదిశంకరాచార్యులవారు శుద్ధ వైష్ణవుడని చిన్న జీయర్ వ్యాఖ్యలు హిందూ సమాజంలో చీలిక తెచ్చేలా ఉన్నాయని పేర్కొంటూ రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షుడు రామిరెడ్డి, మలక్‌పేట్ (Malakpet)  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముచ్చింతల్‌లో జరిగిన సమతా కుంభ్ వేదికగా చిన్న జీయర్ చేసిన  వ్యాఖ్యలు కోట్లాది మంది శివభక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ, శైవ-వైష్ణవ విభేదాలను సృష్టించేలా వ్యవహరించిన చిన్న జీయర్ స్వామిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జీయర్ స్వామి (Chinna Jeeyar)  బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని వానరసేన ప్రతినిధులు వార్నింగ్ ఇచ్చారు.

Read Also: భద్రాచలం ఆస్పత్రిలో అరుదైన ప్రసవం.. ఐదు కిలోల బరువుతో మగబిడ్డ జననం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>