కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu), ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కలిశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పేషీలో ఇద్దరూ వేర్వేరుగా పవన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.
ఇటీవల తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని పవన్ జనసేన నాయకులకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాతే నాగబాబు సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేసినట్లు చర్చ జరిగింది. అయితే నాగబాబు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత రాజకీయంగా అంత చురుగ్గా లేరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ పార్టీపై, ప్రభుత్వంపై వచ్చే విమర్శలను ఖండించాలని పవన్ (Pawan Kalyan) సూచించినట్లు సమాచారం.
Read Also: రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయండి.. స్పీకర్‌కు ఎంపీ నిషికాంత్ నోటీసులు
Follow Us On: Instagram


