కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) సోషల్ మీడియాలో ఒక సంచలన వీడియో విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం సుమారు 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్లో ప్రవేశించి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంటూ సదరు వీడియోను షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పై దాడికి యత్నించారని ఆరోపించారు. సదరు ఎంపీలు ప్రధాని మోడీని సైతం భయపెట్టినట్టు వెల్లడించారు. బీజేపీ చర్చలను, వాదనలను ప్రోత్సహిస్తుందని, ఎదుటి వారిని శారీరకంగా బెదిరించడం లేదా హింసించడాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీల (Congress MPs) ప్రవర్తన చాలా అవమానకరంగా ఉందని కిరణ్ రిజిజు (Kiren Rijiju) వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీలు స్పీకర్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంతటి ఘోరమైన సంఘటన జరిగి ఉండేదో అని భయాందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ గౌరవాన్ని, స్థానిక పరిస్థితుల్ని రక్షించడానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
Read Also: జాహ్నవి కందుల కుటుంబానికి పరిహారం
Follow Us On: Instagram


