epaper
Wednesday, February 18, 2026
epaper

ప్ర‌పంచానికి మ‌న‌మే కంప్యూట‌ర్లు అందిస్తాం: సీఎం చంద్ర‌బాబు

క‌లం, వెబ్ డెస్క్‌: భ‌విష్య‌త్తులో మ‌న ద‌గ్గ‌రి నుంచే ప్ర‌పంచానికి కంపూట‌ర్లు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు (Chandrababu) వ్యాఖ్యానించారు. ఏపీ స‌చివాల‌యంలో మంత్రులు, అధికారుల‌తో జ‌రిగిన స‌మీక్ష‌లో స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేసిన‌ట్లు సీఎం చెప్పారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెనుమార్పులు రానున్నాయ‌ని సీఎం తెలిపారు. ప్రతి నెల అధికారులు సమీక్షలు నిర్వహించాల‌ని సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు నిబ‌ద్ధ‌త‌తో పని చేయాల‌ని కోరారు.

గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశార‌ని సీఎం ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను బాగు చేేసేందుకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. మాజీ సీఎం ఇంటి పక్కన హెలీప్యాడ్ కోసం ఓ ప్రైవేట్ వ్యక్తి భూమిని లాక్కోవాలని ప్రయత్నించార‌న్నారు. మాట వినలేదని బలవంతంగా స్వాధీనం చేసుకుని కేసు పెట్టార‌ని ఆరోపించారు. స‌ద‌రు వ్య‌క్తి వేరే వాళ్ల‌ ద‌గ్గ‌ర కొనుక్కున్న భూమిని లాక్కొని, 22ఏ కింద పెట్టార‌న్నారు. చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల్సిన వ్య‌క్తి ప్రైవేటు ఆస్తిని ఇలా చేయ‌డం అత‌డి ప‌రాకాష్ట‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. స‌ద‌రు వ్య‌క్తితో సీఎం చంద్ర‌బాబు మాట్లాడిన‌ట్లు తెలిపారు. ఇన్నేళ్ల‌లో నీ భూమిని ఆక్ర‌మిస్తే ఏం చేశావ‌ని ప్ర‌శ్నించిన‌ట్లు చెప్పారు. దీనికి స‌మాధానంగా అత‌ను ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్ప‌టికైనా పోరాడ‌గ‌ల‌న‌ని చెప్పాడ‌న్నారు ఇటీవ‌ల స‌ద‌రు వ్య‌క్తి త‌న స‌మ‌స్య‌పై ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>