కలం, వెబ్ డెస్క్ : క్రిస్టల్ ప్యాలెస్(Crystal Palace) పరాజయాల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ప్రీమియర్ లీగ్ డర్బీ (Premier League Derby) లో బ్రైటన్(Brighton) ను 1-0తో ఓడించి, 12 మ్యాచ్‌లుగా ఎదురవుతున్న ఓటములకు ముగింపు పలికింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ హాఫ్ అత్యంత నీరసంగా, నిరుత్సాహంగా సాగింది. 43వ నిమిషంలో ఇస్మైలా సార్‌కు గోల్ అవకాశం వచ్చినా అది వృథా అయింది. దీంతో స్యాలెస్ అభిమానులు మరో పరాజయం తప్పదన్న భావనకు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు.
సెకండ్ హాఫ్‌లో గేమ్ కీలక మలుపు తీసుకుంది. 61వ నిమిషంలో బ్రైటన్(Brighton) డిఫెన్స్ చేసిన తప్పిదాన్ని ఎవాన్ గెసాండ్ (Evann Guessand) బాగా వినియోగించుకున్నాడు. అదే మంచి అవకాశంగా భావించి బంతిని సార్‌కు పాస్ చేశాడు. తన దగ్గరకు వచ్చిన బంతిని సార్ వెంటనే గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత స్కోర్‌ను బ్రైటన్ సమం చేయడానికి ప్రయత్నించినా, గోల్‌కీపర్ డీన్ హెండర్సన్ కీలక సేవ్‌తో ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. జోర్గెన్ స్ట్రాండ్ లార్సన్ మరో రెండు అవకాశాలు పొందినా స్కోరు మారలేదు. అదనపు సమయంలోనూ ప్యాలెస్ ఆధిక్యాన్ని కాపాడుకుని విలువైన మూడు పాయింట్లు సాధించింది. ఈ విజయంతో ప్యాలెస్ లీగ్ పట్టికలో ముందుకు సాగగా, బ్రైటన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.


