కలం, డెస్క్ : విజయవాడ (Vijayawada) సీపీ ఆఫీస్ ముందు రోడ్డుపై ఓ యువకుడు నిరసన చేయడం చర్చనీయాంశంగా మారింది. తన బైక్ కు ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపాడు. 3 ఏళ్ల కిందట బైక్ పోయిందని కంప్లయింట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదని.. ఇప్పుడు కొత్త బైక్ కొనుక్కుంటే ఫైన్లు వేస్తారా అంటూ ప్రశ్నించాడు. అసలు చలాన్ రాసే అధికారం పోలీసులకు ఎక్కడిదంటూ మండిపడ్డాడు సదరు యువకుడు. కుదిరితే పాత కేసులో న్యాయం చేయాలని.. లేదంటే ప్రస్తుతం వేసిన ఫైన్లను క్యాన్సిల్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో సూర్యారావుపేట పోలీసులు కాసేపు అతనికి నచ్చజెప్పాలని చూశారు. మాట వినకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also: పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ
Follow Us On: Instagram


