కలం, డెస్క్ : భూపాలపల్లి జిల్లాను (Bhupalpally District) రద్దు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అవన్నీ నిజం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). భూపాలపల్లి జిల్లాగానే కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏ జిల్లాను కూడా రద్దు చేయబోమని.. కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన తమకు లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘ఒకవేళ ప్రస్తుతం ఉన్న జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలి అనుకుంటే ప్రజలకు చెప్పి అసెంబ్లీలో చర్చ జరిపి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే చేస్తాం. అంతే గానీ ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. కుట్రలు చేసినా భూపాలపల్లి ప్రజలు నమ్మవద్దు. భూపాల పల్లి జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత మేం తీసుకుంటాం’ అని తెలిపారు సీఎం రేవంత్.
కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే భూపాలపల్లి నేడు జిల్లాగా వెలుగుతోందన్నారు సీఎం రేవంత్. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గు నిల్వలు దేశానికే గర్వకారణంగా ఉన్నాయని.. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది మహామహులు రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగినట్టు తెలిపారు. అలాంటి జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ (Revanth Reddy) వెల్లడించారు.
Read Also: ఆ ప్రచారం అబద్ధం.. దలైలామా కార్యాలయం
Follow Us On: X(Twitter)


