కలం, డెస్క్ : బూతులు మాట్లాడే నాయకులకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న వెంకయ్య నాయుడు ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడారు. ఈ రోజుల్లో బూతులు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని.. ఇది అన్ని పార్టీల్లోనూ ఉందన్నారు. ఇలా బూతులు మాట్లాడితే హైలెట్ అవుతామని కొందరు మాట్లాడుతున్నట్టు తెలిపారు వెంకయ్య. ఇప్పటికీ కొందరు నాయకులు పద్ధతిగానే ఉంటున్నారని.. అలాంటి వారిని చూసైనా మిగతా వారు మారాల్సిన అవసరం ఉందన్నారు. తమ హయాంలో ఇలాంటివి ఏమీ లేవని.. వ్యక్తిగత విమర్శలకు చాలా దూరంగా ఉండేవారం అంటూ వెంకయ్య నాయుడు వివరించారు.
Read Also: అంబటి రాంబాబుపై ఏపీ వ్యాప్తంగా 36 కేసులు.. ఇప్పట్లో బెయిల్ కష్టమేనా..?
Follow Us On: X(Twitter)


