epaper
Wednesday, February 18, 2026
epaper

కేసీఆర్ చరిత్ర అంతా అక్రమాలే.. దాన్ని నేను చెరపను : సీఎం రేవంత్

కలం, డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ చరిత్రను తాను చెరిపేస్తున్నట్టు బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని.. తాను చెరిపే చరిత్ర కేసీఆర్ ది కాదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వికారాబాద్ జిల్లా నారాయణపూర్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘కేసీఆర్ చరిత్ర అంతా అక్రమాలే. దాన్ని నేనెందుకు చెరుపుతాను. కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల చరిత్ర నేను తుడిస్తే పోతదా. ఆర్ ఎస్ ప్రవీణ్‌ కుమారే చెప్పారు. కేసీఆర్ మీద దొంగనోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉందని. కేసీఆర్ వెంబడి ఉన్న నాయకుడు దొంగనోట్లలో దొరికితే కేసీఆర్ కూడా అడ్డంగా దొరికినట్టు ప్రవీణ్ కుమారే చెప్పారు. అలాంటి చరిత్ర కేసీఆర్ (KCR) కు ఉంది. దళితులకు మూడెకరాలు ఇస్తానని మోసం చేసిన చరిత్ర, డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో చేసిన మోసం చేసిన చరిత్ర.. 1200 మంది ప్రాణత్యాగాలకు మీరు చేసిన ద్రోహం నేను చెరిపితే చెరుగుతదా’ అంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.

పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉండి, కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండి మున్సిపాలిటీలను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ (Revanth Reddy). కేటీఆర్ కు ఇన్ని రోజులు వికారాబాద్, తాండూరు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ‘ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేవెళ్లలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చేవెళ్లతోపాటు వికారాబాద్, తాండూరు, కొడంగల్ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని వైఎస్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆయన హయాంలోనే వందల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులను కేసీఆర్ హయాంలో పక్కన పెట్టేసి.. రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రంగారెడ్డికి నీళ్లు తీసుకొచ్చి ఉంటే 30 లక్షల ఎకరాలకు నీరు అందేది. ఆ పనులు కంప్లీట్ చేయకుండా కేసీఆర్ చేసిన అన్యాయం వల్లే ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని చూస్తే.. సొంత రాష్ట్ర వ్యక్తి అయిన కేసీఆర్ మాత్రం అన్యాయం చేశారు’ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసమే బీఆర్ ఎస్ లోకి వెళ్లానని చెప్పారని.. మరి ఈ ప్రాంతానికి నిధులు ఎందుకు తీసుకురాలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రంగారెడ్డికి ఒరిగిందేమీ లేదని.. ఆయన ఎంతసేపు పక్క రాష్ట్రం కోసమే పనిచేశారని విమర్శించారు. లక్ష్మీ దేవిపల్లిలో త్వరలోనే భూసేకరణ చేసి రిజర్వాయర్ కడుతామని.. గోదావరి జలలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, చేవెళ్ల ప్రాంతానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

అప్పా జంక్షన్-మన్నెగూడ రోడ్డు మీద..

రంగారెడ్డి జిల్లాలో ఎంతో కీలకమైన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎంత దారుణంగా ఉండేదో అందరికీ తెలుసని.. కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి నిర్లక్ష్యం వల్లే ఆ రోడ్డు పనులు ఆగిపోయినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ‘కేసీఆర్ పదేళ్ల పాటు ఆ రోడ్డును పట్టించుకోకపోవడం వల్లే ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. మొన్న కంకర టిప్పర్ వెళ్లి బస్సును ఢీ కొంటే 40 మంది చనిపోయారు. ఆ పాపం కచ్చితంగా కేసీఆర్ దే. కేంద్రం నుంచి మంజూరైన నేషనల్ హైవేను కొందరు పర్యావరణం పేరుతో అడ్డుకున్నారు. నేను సీఎం అయ్యాక వాళ్లతో స్వయంగా మాట్లాడి సమస్యలు క్లియర్ చేశాను. ఇప్పుడు రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి’ అంటూ వివరించారు సీఎం రేవంత్.

లక్షా 50వేల ఎకరాలకు నీరు..

వికారాబాద్ జిల్లాలో ఎంతో కీలకమైన మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి.. మూడేళ్లలో లక్షా 50వేళ ఎకరాలకు నీళ్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. కేవలం రైతుల కోసమే కాదు.. నిరుద్యోగుల కోసం కూడా మేం ఎంతో ఆలోచిస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు గ్రూప్-1 ఉద్యోగాలు వస్తే తట్టుకోలేక కోర్టుల్లో పిటిషన్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ కాంగ్రెస్ హయాంలో వేలాది ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంటాం’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

Read Also: షార్ట్​ సర్క్యూట్​ వల్లే నాంపల్లి ఎఫ్ఎస్​ఎల్​ అగ్ని ప్రమాదం : ఫైర్ డీజీ విక్రమ్​ సింగ్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>