కలం, ఖమ్మం బ్యూరో : నెల రోజుల నుంచి పరారీలో ఉన్న కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ (Forest Development Official) తాటి శ్రావణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జనవరి 3న ఫారెస్ట్ రేంజర్ రాజేందర్ రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికినప్పటి నుంచి శ్రావణి అజ్ఞాతంలో ఉన్నారు.
కాగా వైజాగ్ లో ఆమె ను ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆమెను కోర్టు ముందు హాజరు పరచనున్నారు. జమైల్ కలప నరికివేతకు సంబంధించి టన్నుకు 90 రూపాయల చొప్పున రూ.28.8 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
Read Also: ఏ కేసు ఫైళ్లు కాలిపోయాయో ఇంకా తెలీదు : డీసీపీ శిల్పవల్లి
Follow Us On: Youtube


