epaper
Wednesday, February 18, 2026
epaper

తూర్పుగోదావరి జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన పులి

కలం, వెబ్​ డెస్క్​ : తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో గత ఆరు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన పులి (tiger caught) ఎట్టకేలకు చిక్కింది. కుర్మాపురం గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో పులి దాక్కున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా పులిని బంధించారు.

గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే అటవీ శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించి, ప్రాణ నష్టం సంభవించకుండా పులిని పట్టుకోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన పులిని విశాఖపట్నం జూ కు తరలించినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>