epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. కొణతం దిలీప్ సన్నిహితుడికి సిట్​ నోటీసులు

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case ) లో సిట్​ అధికారులు దూకుడు కొనసాగుతోంది. బీఆర్​ఎస్​ ముఖ్యనేతలతో పాటు, గతంలో ఆ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులకు సిట్​ నోటీసులు జారీ చేస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో ఆ పార్టీ సోషల్​ మీడియా ఇన్​చార్జ్​ కొణతం దిలీప్​ కి సన్నితుడిగా ఉన్న సామ్రాట్​ అనే వ్యక్తికి సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. రేపు (శుక్రవారం) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​ లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case ) కు సంబంధించి సీఆర్​పీసీ 160 కింద వివరణ ఇవ్వాల్సిందేనని పోటీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత ప్రభుత్వంలో డిజిటల్​ మీడియా విభాగంలో కొణతం దిలీప్ కీలక పాత్ర పోషించారు. ఆయన టీమ్ లో సామ్రాట్​ అనే వ్యక్తి పని చేశారు. ఫోన్ ట్యాపింగ్​ కి సంబంధించి ఇటీవల పలు సోషల్​ మీడియా వేదికల్లో పోస్టులు పెట్టడంతో వాటికి సంబంధించిన వివరాలు ఆధారాలు రాబట్టేందుకే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఫోన్​ ట్యాపింగ్​ దర్యాప్తు కీలక దశకు చేరడంతో రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరికి నోటీసులు అందుతాయనేది ఆసక్తిగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>