కలం, ఆలేరు : ఆలేరు (Aleru) మున్సిపల్ పట్టణ కేంద్రం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది.. అలాంటి కంచుకోటలో ఆ పార్టీకి బీటలు వారుతున్నాయి. ఎవరో బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టడం లేదు సొంత పార్టీ నేతలే బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేసుకుంటున్నారు. ఆలేరులో బీఆర్ఎస్ కు ఉన్న బలమైన క్యాడర్ క్రమంగా తగ్గుతుంది. ఆ పార్టీ సమన్వయ లోపం అంతర్గత పోరు తార స్తాయికి చేరి క్యాడర్ కు భరోసా ఇచ్చే నాయకులు కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకుల నుండి సామాన్య కార్యాకర్త వరకు ఎవరితో పనిచేయాలని సందిగ్ధంలో ఉన్నారు. మొట్ట మొదటి మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) లో బీఆర్ఎస్ జెండా ఎగరడంలో బీఆర్ఎస్ కార్యకర్తల అహర్నిశల శ్రమ, పనితనం వెలకట్టలేనిది. అయితే ఈసారి ఆపార్టీ గెలవడంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
బలమైన అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలో మాత్రం జోరు కనిపించడం లేదు. ఓటర్లను ఆకట్టుకోలేక మల్ల గుళ్లాలు పడుతున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రచారంలో ప్రజలకు వివరించలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. గులాబి పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ హామీల పై విమర్శలు ఎక్కుపెట్టడం లేదనే చెప్పాలి. పోటీలో ఉన్న అభ్యర్థులు అధికార పార్టీకి జంకుతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడానికి సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇకనైనా పార్టీ మేలుకుని.. జరిగిన నష్టాన్ని పూడ్చే దిద్దుబాటు చర్యలు తీసుకుని కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపి.. ఎన్నికల్లో (Municipal Elections) ప్రచార జోరు చూపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Read Also: కాంగ్రెస్ గెలుపే ప్రతీ కార్యకర్త లక్ష్యం కావాలి
Follow Us On: Instagram


