epaper
Wednesday, February 18, 2026
epaper

లాయర్ స్వప్న హత్యపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి (RangaReddy)  జిల్లా  మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో జరిగిన లాయర్  స్వప్న హత్య ఘటన పై మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్త సంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితి అని అన్నారు. న్యాయవృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక యువతి ఇలాంటి దారుణానికి బలవడం అత్యంత బాధాకరమైన ఘటన అని ఆమె అన్నారు. ఈ ఘటన సమాజంలో న్యాయ, భద్రతా అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>