epaper
Wednesday, February 18, 2026
epaper

ఆపరేషన్​ కియా.. కశ్మీర్​లో ఇద్దరు తీవ్రవాదులు హతం

కలం, వెబ్​డెస్క్​: జమ్మూకశ్మీర్​లో (Jammu Kashmir) జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు తీవ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి (Kashmir Encounter). మృతుల్లో జైషే టాప్​ కమాండర్​తోపాటు మరో టెర్రరిస్ట్​ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై భారత భద్రతా దళాలు చెప్పిన వివరాల ప్రకారం.. తీవ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలసి ఆర్మీ, సీఆర్​పీఎఫ్​ దళాలు సంయుక్తంగా ‘ఆపరేషన్​ కియా’ చేపట్టాయి.

బసంత్​గఢ్​లోని జోపార్​ అటవీ ప్రాంతాలో మంగళవారం సాయంత్రం0సెర్చింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం దళాలను చూసిన టెర్రరిస్ట్​లు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన దళాలు వెంటనే ఎదురుకాల్పులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్ట్​లను భారత దళాలు మట్టుబెట్టాయి (Kashmir Encounter). ఇంకా తీవ్రవాదులెవరైనా దాగి ఉన్నారేమోనని ‘ఆపరేషన్​ కియా’ దళాలు కొనసాగిస్తున్నాయి.

Read Also: మణిపూర్​లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>