epaper
Wednesday, February 18, 2026
epaper

ఉగాదికి గద్దర్ అవార్డులు.. టాలీవుడ్‌ పెద్దలకు భట్టి కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా మార్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. బుధవారం సెక్రటేరియట్‌లో జరిగిన ‘గద్దర్ సినిమా అవార్డుల’ (Gaddar Awards) జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాంబే, కలకత్తా, చెన్నై వంటి నగరాల్లో సినీ పరిశ్రమ విస్తరణకు అవకాశాలు పరిమితమయ్యాయని, అయితే హైదరాబాద్‌ అన్ని భాషల చిత్ర పరిశ్రమలకు సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. అన్ని ఇండస్ట్రీలు హైదరాబాద్‌కు తరలివస్తే రాష్ట్ర యువతతో పాటు టెక్నీషియన్లు, రచయితలు, దర్శకులకు భారీగా ఉపాధి లభిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

గత ప్రభుత్వం దశాబ్ద కాలంగా అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని విమర్శించిన భట్టి విక్రమార్క, సమాజంపై అత్యంత ప్రభావం చూపే సినీ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం అవార్డులతో తిరిగి ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలంగాణ కళలు, విప్లవం, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని, ఆయన పేరు మీద ఈ అవార్డులను ప్రతిభ, పారదర్శకత ప్రాతిపదికన అందజేస్తామని తెలిపారు.

ఎంపిక చేసే సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండాలని జ్యూరీ సభ్యులకు సూచించారు. ఈ నెల 6 నుంచి సినిమాల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని, మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా గద్దర్ అవార్డుల (Gaddar Awards) పంపిణీ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజు, తనికెళ్ల భరణి, కె.ఎస్. రామారావు, రోజా రమణి, అశోక్ కుమార్ పాల్గొన్నారు.

 Read Also: ఫిబ్రవరి వచ్చింది.. రైతుబంధు ఏది : హరీష్‌ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>